Pawan kalyan Modi Bonding: ఏపీలో ఎన్నికల డేట్ దగ్గర పడుతున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా ఒకపక్క వైసీపీ నేతలు, మరోపక్క కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచగా కూటమి తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆంధ్ర వచ్చారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్యనేతలు, టీడీపీ నేత నారా లోకేష్ శాలువా కప్పి స్వాగతం పలకగా ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై వచ్చిన ప్రధానికి జనసేనాని శాలువా కప్పి స్వాగతం పలికి మోదీ కాళ్లకు పవన్ నమస్కరించబోగా అందుకు ఆయన వద్దని నిరాకరించారు. కాళ్లకు నమస్కారం పెట్టవద్దని జనసేనానికి చెబుతూ మోదీ కూడా కిందకు వంగారు.
Throw Back: కడుపుతో ఉన్న నటిని 51 సార్లు కత్తితో పొడిచి, 16 ముక్కలుగా నరికి చంపారు!
ఆ అనంతరం పవన్‌ను ప్రధాని మోదీ ఆలింగనం చేసుకున్నారు. ఇక ఈ సీన్ చూసిన ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఇక అనంతరం ప్రధాని మోడీ మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. రాజమండ్రి వేమగిరిలో కూటమి తరపున నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అయోధ్యకు రాముడిని తీసుకొచ్చిన మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ శక్తి ఏంటో చూపించారని కొనియాడారు. దేశాభివృద్ధితో పాటు గుండె ధైర్యం కూడా అవసరమేనని, శత్రువుల నుంచి దేశాన్ని కాపాడాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. భారత్ వైపు చూడాలంటే పదేళ్లుగా శత్రువులు భయపడిపోతున్నారని ఎందుకంటే మోడీ ఒక్క పిలుపుతో దేశంలోని ప్రతి అణువు కదిలి వస్తోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు, పథకాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అకౌంట్లో వేసుకుంటోందని విమర్శించారు, కొన్ని పథకాలను సీఎం జగన్ సరిగా వినియోగించుకోలేక పోయారని పవన్ మండిపడ్డారు.