Site icon NTV Telugu

Pawan Kalyan: మేం అధికారంలోకి వస్తే…

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదిగా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. అమ్నఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి..? ఆరోగ్య శ్రీ డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు..? అన్నింటికీ కారణం అభివృద్ధి లేకపోవడమే కారణం అన్నారు.. అమర్ రాజా సంస్థ, కియా అనుబంధ పరిశ్రమలు వైసీపీ చేసే గొడవకు వెళ్లిపోయాయని విమర్శించిన ఆయన.. గ్రామ పంచాయతీల్లో డబ్బుల్లేవ్.. టీడీపీ ఐదేళ్ల హయాంలో రూ. 53 వేల కోట్ల మేర మద్యం ద్వారా ఆదాయం వస్తే.. వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలోనే రూ. 46 వేల కోట్ల మద్యం ఆదాయం వస్తోందన్నారు.. ఐఎమ్ఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కాదు.. ఇడుపులపాయ మేడ్ ఫారిన్ లిక్కరులా మారిందని ఎద్దేవా చేశారు. ఇక, జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది? అనేదానిపై ప్రజల ముందు తమ విధానాలను పెట్టారు పవన్‌ కల్యాణ్.

Read Also: Pawan Kalyan: ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం

జనసేన అధికారంలోకి వస్తే అప్పుల్లో ఉన్న ఏపీని.. అప్పుల్లేని ఏపీగా చేయడమే లక్ష్యం అన్నారు.. కొత్త పారిశ్రామిక విధానాన్ని తెస్తాం.. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేస్తాం.. వైట్ రేషన్ కార్డ్ హోల్డర్లకు ఇసుక ఉచితంగా ఇస్తాం.. పాతిక కేజీల బియ్యం కాదు.. పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇస్తాం అన్నారు. సులభ్ కాంప్లెక్సులో ఉద్యోగాలివ్వం.. యువత వారి కాళ్ల మీద వాళ్లే నిలబడేలా చేయూత ఇస్తామన్న ఆయన.. వ్యాపారం చేసుకునే యువతకు ఐదేళ్లల్లో ఐదు లక్షల మంది యువతకు రూ. 10 లక్షలు ఇస్తాం అన్నారు.. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం.. జనసేన అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీని చేపడతాం.. ప్రైవేట్ రంగంలో కూడా ఏటా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version