NTV Telugu Site icon

Pawan Kalyan: చావ‌డానికైనా సిద్ద‌మే… త‌ల‌వంచి వంగి వంగి దండాలు పెట్ట‌ను…

న‌ర‌సాపురం మ‌త్స్యకారుల అభ్యున్న‌తి స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క ప్ర‌సంగం చేశారు. మ‌త్స్య‌కారుల‌కు అండ‌గా ఉంటామ‌ని అన్నారు. రాష్ట్రం నుంచి ప్ర‌తిఏటా 25 వేల మంది మ‌త్స్య‌కారులు గుజ‌రాత్‌కు వ‌ల‌స వెళ్తున్నార‌ని ఇలా ఎందుకు వ‌లస వెళ్లాల్సి వ‌స్తున్న‌దో ప్ర‌భుత్వం ఆలోచించాల‌ని అన్నారు. కానీ, ప్ర‌భుత్వం ఇవేమి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఎవ‌రి ద‌గ్గ‌దా డ‌బ్బులు ఉండ‌కూడ‌దు అన్న‌ది ప్ర‌భుత్వం ఆలోచ‌న‌గా ఉంద‌ని, అంద‌రూ దేహీ అని అడుక్కోవాలన్న‌ది ప్ర‌భుత్వం ఉద్దేశంగా ఉంద‌ని అన్నారు. ఇది ప్ర‌జాస్వామ్యం అని, నియంతృత్వ రాజ్యం కాద‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంతా అండ‌గా ఉండాల‌ని, అండ‌గా నిల‌బ‌డితే, తాను త‌న ప్రాణాలు ఇచ్చైనా స‌రే ప్ర‌భుత్వంతో పోరాటం చేస్తాన‌ని అన్నారు. ఎవ‌రికి వంగివంగి దండాలు పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు.

Read: Pawan Kalyan: మీకు అధికారం ఇచ్చింది మ‌టన్, చేప‌లు అమ్ముకోవ‌డానికా?