NTV Telugu Site icon

Pawan Kalyan: జగన్ ను ఇమిటేట్ చేసిన పవన్.. వీడియో వైరల్

Jagan

Jagan

Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్, సీఎం జగన్ మధ్య మాటల యుద్ధం మరింత ఘాటుగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక పవన్ వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే ఆయన అస్వస్థతకు గురయిన విషయం తెల్సిందే. తన అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పవన్.. ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక మరోపక్క సీఎం జగన్.. పవన్ పై ఘాటు ఆరోపణలు చేసిన విషయం విదితమే. జ‌గ‌న‌న్న అమ్మ ఒడి ప‌థ‌కం నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా కురుపాంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్, పవన్ పై విరుచుకుపడ్డారు.”ఆ ప్యాకేజీ స్టార్‌ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు, తాట తీస్తానంటాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు మేము తిట్టలేము. ఆ మనిషి నోటికి అదుపు లేదు. అత‌నికి నిలకడ లేదు. పవన్ లా నాలుగేళ్ల‌కు ఒక‌రిని చొప్పున నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేము. పెళ్లి అనే ప‌విత్ర‌మైన దాన్ని రోడ్డున ప‌డేయ‌లేం.అవన్నీ వారికి చెందిన పేటెంట్ హక్కులే” అని జగన్ విమర్శించారు.

Jagadish Reddy : హైటెక్స్‌లో ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌పో 2023ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

ఇక తాజాగా జగన్ వ్యాఖ్యలపై పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ను ఇమిటేట్ చేసి చూపిస్తూ నవ్వులు పూయించారు. ” సరే ఆయన బాధపడిపోతూ ఉన్నారు. నేను ఊగిపోతా మాట్లాడతాను అని చెప్పి.. సరే ఒక పని చేస్తా.. ముఖ్యమంత్రి గారికి.. రేపటి నుంచి ఇలా.. ఇలా.. ఇలా మాట్లాడతాను. అది ఓకేనా.. రేపటి నుంచి దయచేసి ఇలా ఇలా ఇలా మాట్లాడతాను అంటూ జగన్ చెయ్యి పైకెత్తి మాట్లాడే విధంగా చేసి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీనిపై జగన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Show comments