Pawan Kalyan: సీఎం జగన్.. ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Demands CM YS Jagan To Answer These 3 Basic Questions: ఏలూరు బహిరంగ సభలో వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో పాటు పవన్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. తన వ్యాఖ్యాల్ని వెనక్కు తీసుకొని, తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు సైతం పవన్ వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ.. వాలంటీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడిగారు. అయితే.. పవన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తన మాటలకి కట్టుబడి ఉంటూ.. సందర్భానుకూలంగా వాలంటీర్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ట్విటర్ మాధ్యమంగా మూడు ప్రశ్నలు సంధించారు. ఇందుకు జవాలు చెప్పాలని సీఎం జగన్‌ని డిమాండ్ చేశారు.
Cab Driver: క్యాబ్ డ్రైవర్ పాడుపని.. డ్రైవింగ్ చేస్తూ మహిళ కళ్లెదుటే హస్తప్రయోగం
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
ఇంతకీ పవన్ సంధించిన ఆ ప్రశ్నలేమిటంటే..
* వాలంటీర్ల బాస్ ఎవరు?
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం ఎక్కడ స్టోర్ చేస్తోంది?
* వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు, ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?
ఇవే.. పవన్ అడిగిన ఆ ప్రశ్నలు. ఈ ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు. వాలంటీర్లు సేకరిస్తోన్న డేటా ఎక్కడికి వెళ్తోందని అందరూ ఆందోళన చెందుతున్నారని.. సీఎంగా ఎవరున్నా, డేటా గోప్యత చట్టాలు అలాగే ఉంటాయని పవన్ ట్విటర్ మాధ్యమంగా పేర్కొన్నారు. ఇదే ట్వీట్‌కు.. గతంలో డేటా గోప్యతపై జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోని సైతం పవన్ ఎటాచ్ చేశారు. ఆధార్ కార్డు, బ్యాంక్ ఎకౌంట్, ఓటర్ ఐడీ వివరాలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉంటే.. అది నేరం కిందకే వస్తుందని ఆ వీడియోలో జగన్ పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు. ఆ వీడియోకి కౌంటర్‌గా.. పై విధంగా పవన్ మూడు ప్రశ్నలు అడిగారు.
Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws will remain the same,whether you are CM or not. So answer these basic three questions.
1) Who’s the Boss of Volunteers?
2) Where are you storing the
personal data of People of AP?
3) Who has authorised… pic.twitter.com/oWsMb04RCj— Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?