NTV Telugu Site icon

Pawan Kalyan: సీఎం జగన్.. ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పండి

Pawan Questions Jagan

Pawan Questions Jagan

Pawan Kalyan Demands CM YS Jagan To Answer These 3 Basic Questions: ఏలూరు బహిరంగ సభలో వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో పాటు పవన్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. తన వ్యాఖ్యాల్ని వెనక్కు తీసుకొని, తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు సైతం పవన్ వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ.. వాలంటీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడిగారు. అయితే.. పవన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తన మాటలకి కట్టుబడి ఉంటూ.. సందర్భానుకూలంగా వాలంటీర్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ట్విటర్ మాధ్యమంగా మూడు ప్రశ్నలు సంధించారు. ఇందుకు జవాలు చెప్పాలని సీఎం జగన్‌ని డిమాండ్ చేశారు.

Cab Driver: క్యాబ్‌ డ్రైవర్ పాడుపని.. డ్రైవింగ్ చేస్తూ మహిళ కళ్లెదుటే హస్తప్రయోగం

ఇంతకీ పవన్ సంధించిన ఆ ప్రశ్నలేమిటంటే..
* వాలంటీర్ల బాస్ ఎవరు?
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం ఎక్కడ స్టోర్ చేస్తోంది?
* వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు, ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?
ఇవే.. పవన్ అడిగిన ఆ ప్రశ్నలు. ఈ ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు. వాలంటీర్లు సేకరిస్తోన్న డేటా ఎక్కడికి వెళ్తోందని అందరూ ఆందోళన చెందుతున్నారని.. సీఎంగా ఎవరున్నా, డేటా గోప్యత చట్టాలు అలాగే ఉంటాయని పవన్ ట్విటర్ మాధ్యమంగా పేర్కొన్నారు. ఇదే ట్వీట్‌కు.. గతంలో డేటా గోప్యతపై జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోని సైతం పవన్ ఎటాచ్ చేశారు. ఆధార్ కార్డు, బ్యాంక్ ఎకౌంట్, ఓటర్ ఐడీ వివరాలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉంటే.. అది నేరం కిందకే వస్తుందని ఆ వీడియోలో జగన్ పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు. ఆ వీడియోకి కౌంటర్‌గా.. పై విధంగా పవన్ మూడు ప్రశ్నలు అడిగారు.

Show comments