NTV Telugu Site icon

Pawan Kalyan: ఎస్సీ యువతపై నాన్ బెయిలబుల్ కేసులా?

Pawan Kalyan Tirupathi

Pawan Kalyan Tirupathi

ఏపీలో ఒకవైపు వైసీపీ ప్లీనరీ జరుగుతుంటే విపక్ష నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం భావ్యం కాదన్నారు. పోలీసులు సామరస్యంగా వ్యవహరించాలి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ఫోటోలను కాగితం ప్లేట్లపై ముద్రించి ఉండటాన్ని చూసి ప్రశ్నించిన గోపాలపురం ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం సరైంది కాదన్నారు.

SSMB 28 : ఆగస్ట్ నుంచే మహేశ్, త్రివిక్రమ్ సినిమా 

కొత్తపేట నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో ఈ తరహా కాగితం ప్లేట్లను చూసి తమ నిరసన గళాన్ని వినిపించిన 18 మందిని వేధిస్తున్నారు. ఎస్సీ యువకులపై నేరపూరిత కుట్ర ఆపాదిస్తూ కేసు నమోదు చేయడం ద్వారా విషయాన్ని తీవ్రతరం చేశారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో పోలీసు అధికారులు సామరస్య ధోరణితో వ్యవహరించాలి. ప్రజల మధ్య దూరం పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులతోపాటు అన్ని పార్టీలపైనా ఉంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకొన్నప్పుడు స్థానికంగా అన్ని పార్టీలు, అన్ని వర్గాలూ ఒక తాటిపైకి వచ్చి శాంతి కమిటీ వేసుకొని సుహృద్భావ పరిస్థితులు నెలకొనేలా చర్చించుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్.

BJP : ఈటల బృందం వ్యూహం ఏంటి ? సత్తా నిరూపించకపోతే ఇబ్బందేనా