తూర్పుగోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్ ఉద్రేకంగా ప్రసంగించారు. మత్స్యకారులకు జీవో 217 పెద్ద సమస్యగా మారిందని, రాష్ట్రంలో సుమారు లక్షన్నర మంది మత్స్యకారులు ఉన్నారని అన్నారు. మొదటి నుంచి చెబుతున్నట్టుగా జనసేన పార్టీ మత్స్యకారులకు మద్దతుగా నిలుస్తున్నదని, వారి తరపుప పోరాటం చేస్తున్నదని పవన్ పేర్కొన్నారు. జనసేకు కనీసం పదిమంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 వచ్చేది కాదని అన్నారు.
Read: Pawan Kalyan: అక్రమకేసులపై జనసేనాని అగ్రహం… భయపడేది లేదు…
తాను ప్రభుత్వం ఇచ్చిన జీవో 217 జీవోను చింపేస్తున్నానని, మత్స్యకారుల కోసం జీవోను చింపేస్తున్నానని అన్నారు. అవసరమైతే తనను జైలుకు పంపితే పంపుకోండని అన్నారు. తాను చట్టాలను నమ్ముతానని, కానీ, ఇబ్బందులు పెట్టే చట్టాలను ఉల్లంఘిస్తానని అన్నారు. తాను భయపడేందుకు, వంగివంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. చిన్న వలతో సముద్రంలోకి పోవాలంటే ఎంతో సహనం ఉండాలని, మత్స్యకారుల సాహసమే తనకు స్పూర్తి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
