Site icon NTV Telugu

జనసేన కమిటీలను ప్రకటించిన పవన్

Pawan Kalyan

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. అందులో భాగంగా జనసేన పార్టీ కమిటీలను ప్రకటించారు. ఐదుగురిని ప్రధాన కార్యదర్శులుగా.. 17 మందిని కార్యదర్శులుగా.. 13 మందిని సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.. ఇక, 9 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కూడా ప్రకటించారు జనసేనాని.. మరోవైపు.. ఐటీ, డాక్టర్స్, చేనేత, మత్స్యకారులు, లీగల్ విభాగాలను ఏర్పాటు చేసి.. వాటికి అధ్యక్షులను నియమించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను పరిశీలిస్తే.. కృష్ణా జిల్లా – బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ – పోతిన మహేష్, తూర్పుగోదావరి – కందుల దుర్గేష్, చిత్తూరు – డాక్టర్ పి. హరిప్రసాద్, అనంతపురం – వరుణ్, ప్రకాశం జిల్లా – షేక్ రియాజ్, నెల్లూరు – సీహెచ్‌ మని క్రాంత్ రెడ్డి, పశ్చిమగోదావరి – కె.గోవింద రావు, గుంటూరు – గాదె వెంకటేశ్వరరావును నియమించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌.

Exit mobile version