Site icon NTV Telugu

Pawan Kalyan: మీకు అధికారం ఇచ్చింది మ‌టన్, చేప‌లు అమ్ముకోవ‌డానికా?

న‌ర‌సాపురంలో మ‌త్స్యకారుల అభ్యున్న‌తి స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ ప్ర‌భుత్వంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌లు లేని స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నార‌ని, స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించ‌మంటే కాల‌యాప‌న చేస్తున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ మండిప‌డ్డారు. పెన్ష‌న్లు, ప్ర‌భుత్వ సాయం రాదంటూ వైసీపీ నేత‌లు బెదిరిస్తున్నారని మండిప‌డ్డారు. బ్రాంధీషాపులు, చీకుల షాపులు పెట్టుకుంటే పెట్టుకోండ‌ని, కానీ, రాష్ట్రంలో ఉన్న‌స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు.

Read: Petrol Prices: షాకింగ్.. లీటరుకు రూ.8 పెరగనున్న పెట్రోల్ ధర

వైపీపీకి ప్ర‌జ‌లు అధికారం ఇచ్చింది మ‌ట‌న్ కొట్లు పెట్టుకొవ‌డానికి, చికెన్ కొట్లు పెట్టుకొవ‌డానికి కాద‌ని అన్నారు. గ‌తంలో వైపీసీ నేత‌లు పాద‌యాత్ర చేసింది మ‌ట‌న్ చేప‌లు అమ్ముకోవ‌డానికా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. పాద‌యాత్ర స‌మ‌యంలో మ‌త్స్య‌కారుల‌కు అనేక హామీలు ఇచ్చార‌ని, ఇచ్చిన హామీలు ఎమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు. చ‌ట్టాలు ప్ర‌జ‌ల‌కే వ‌ర్తిస్తాయా… మీకు వ‌ర్తించ‌వా అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు.

Exit mobile version