NTV Telugu Site icon

Pawan Kalyan: నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సంచలనం

Pawankalyan Janasena

Pawankalyan Janasena

Pawan Kalyan Alleges Blade Batch tries to attack him: ఏపీ ఎన్నికల హడావుడిలో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు ఏపీ పొలిటికల్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన ఒక జనసేన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొంద‌రు త‌న‌ను బ్లేడ్‌తో క‌ట్ చేస్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంతమంది కిరాయి మూకలు ఏం చేస్తున్నారంటే ఎక్కువమంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్ళని నన్ను కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విషయాలలో మనం ప్రొటోకాల్ పాటించాలి అని ప‌వ‌న్ పేర్కొన్నారు. కాకినాడలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ మేర‌కు మాట్లాడారు. జనసేన- టీడీపీ- బీజేపీ- కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు.

Dil Raju: విజయ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ

అక్కడ టిడిపి అభ్యర్థిగా మొన్నటి వరకు ఉన్న వర్మ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడమే కాక కచ్చితంగా గెలిపించి తీసుకొస్తామని బలంగా చెబుతున్నారు. ఈ ఉదయం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి చాలామంది నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగేందుకు వారు ఆసక్తి కనబరిచారు. ఈ సమయంలో కాస్త హడావిడి ఏర్పడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈమెయిల్ కు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనను కలవడానికి వచ్చినట్లుగా వచ్చిన కిరాయి మూకలు సన్నటి బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్ళని కోస్తున్నారని తనని కూడా ఒక సందర్భంలో కోయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

Show comments