Pawan Kalyan: మనకి స్వాతంత్య్రం రావడానికి కొన్ని వేల రక్త తర్పణాలు జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వార్థం లేకుండా ఎంతో మంది చేసిన త్యాగమే స్వాతంత్ర్యమని ఆయన అన్నారు. మనకు స్వాతంత్య్రం ప్రశాంత వాతావరణంలో రాలేదని వెల్లడించారు. దేశ విభజన సమయంలో కొంత మంది దురాశకు 15 లక్షల మంది దారుణంగా హత్య చేయబడ్డారని పవన్ చెప్పారు. 75 వేల మంది ఆడపడుచులపై దారుణాలు జరిగాయన్నారు. మనం సమాజానికి మంచి చేయక పోయినా పర్లేదు.. చెడు మాత్రం చేయకూడదని సూచించారు. మనిషిలో మంచి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసే గొప్ప దేశం ఇదంటూ దేశ గొప్పదనాన్ని వర్ణించారు. ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన దేశం ఇదంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాలలో అనుభవం లేక పోతే వైసీపీ పాలన లాగా ఉంటుందని విమర్శించారు. పదవి కోసం మనం వెంపర్లాడటం కాదు.. పదవే మనల్ని వెతుక్కుంటూ రావాలన్నారు.
మద్యపానం నిషేధం, లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇసుక ఉచితంగా ఇస్తామని మాయ మాటలు చెప్పిన ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తన భవిష్యత్ గురించి తనకు భయం లేదన్న పవన్.. ఈ సమాజం ఏం అవుతుందో అన్న భయమే తనకు ఎక్కువన్నారు. బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉంటుంటే తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ పోరాటంలో పోతే తన ప్రాణం పోతుందని, లేదంటే ఈ సమాజానికి మేలు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవన్న జనసేనాని.. వచ్చే ఎన్నికల్లో జనసేన ఓ బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భావం చెందుతుందన్నారు.
Mahatma Gandhi Temple : మహాత్ముడి గుడికి పెరుగుతున్న భక్తుల రద్దీ
సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సంక్షేమం పేరుతో మనల్ని వైకల్యం బాట పట్టిస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంక పరిస్థితులు రాష్ట్రంలో రాకూడదని కోరుకుంటున్నానన్నారు. రాజకీయం అంటే బూతుల పురాణం ఐపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా రాజా తథా ప్రజా సిద్ధాంతం మారి పోవాలన్నారు. మంచి ప్రజలు మంచి పాలకులను ఎన్నుకోవాలన్నారు.
