NTV Telugu Site icon

Murder: ఏపీలో పరువు హత్య.. వేటకొడవళ్లతో నరికి..

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. కుల మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. కుల జాఢ్యం ఇంకా వేధిస్తూనే ఉంది.. కులం మత్తులో ఇంకా కొంతమంది ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లికి చెందిన గొల్ల నరేంద్ర.. అదే గ్రామంలోని బోయ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు.. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోడంతో.. వారిని ఎదిరించి రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుని కోనేపల్లిలో నివాసం ఉంటున్నారు.. వారికి ఒక కుమార్తె కూడా ఉంది..

Read Also: Gas Price Hiked: వంట గ్యాస్‌పై వడ్డింపు.. రూ.50 పెంచిన చమురు సంస్థలు

అయితే, కుతాంతర వివాహం చేసుకున్న నరేంద్రపై కక్ష గట్టిన యువతి బంధువులు అవకాశం కోసం ఎదురుచూశారు.. రెండేళ్లు గడవడంతో నరేంద్ర ఈ విషయాన్ని లైట్‌ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారి వెంకటాంపల్లికి వెళ్లాడు నరేంద్ర.. అక్కడ, ట్రాక్టర్ రిపేర్‌ చేస్తుండగా నరేంద్రపై దాడి చేశారు.. వేట కొడవళ్లతో నరికి చంపారు యువతి బంధువులు.. ఇక, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.