అనంతపురం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి లో నిరసన తెలపడానికి వెళతానని పరిటాల శ్రీరాం ఇప్పటికే ప్రకటించారు. అయితే పరిటల శ్రీరామ్ అక్కడికి వీల్లేదంటూ నోటీసులు జారీచేశారు పోలీసులు. ఇంటినుంచి బయటకు రాకుండా పోలీసుల పహారా చేపట్టారు. గొందిరెడ్డిపల్లి గ్రామానికి వెళితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. నివాసం నుండి బయటకు రాకుండా ఉండాలంటూ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. పోలీసుల నోటీసులపై పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. శాంతియుత నిరసనకు హౌస్ అరెస్టు ఏంటంటూ శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, అక్రమ మైనింగ్ పై టీడీపీ పోరాటం చేస్తోంది. శనివారం ఛలో గొందిరెడ్డిపల్లికి పిలుపు నివ్వడంతో పెద్ద ఎత్తున రైతులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం వుంది. దీంతో పోలీసులు ఈ ప్రయత్నాలను అడ్డుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి పోలీసులు అనంతపురం, వెంకటాపురంలోని పరిటాల కుటుంబసభ్యుల ఇళ్ళకు వెళ్ళి నోటీసులు జారీచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుంటే ఇలా అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు పరిటాల శ్రీరాం. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే పోలీసులు తమను అడ్డుకుంటున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గొందిరెడ్డిపల్లికి వెళతామన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
