NTV Telugu Site icon

Nursing Student: పేరెంట్స్ తిట్టారని.. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

చిన్నచిన్న కారణాలకే మహిళలు, విద్యార్ధినీ, విద్యార్ధులు, యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నం ఇందిరానగర్ లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పెందుర్తి నియోజక వర్గంలో శంకర్ ఫౌండేషన్ లో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని భవ్యశ్రీ.. ఇంట్లో పనిచెయ్యమని, బాగా చదువుకోమని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శంకర్ ఫౌండేషన్ లో మొదటి సంవత్సరం ఎమ్.పి.హెచ్.డబ్ల్యు చదువుతుంది భవ్యశ్రీ.. పోస్ట్ మార్టం నిమిత్తం కె.జి.హెచ్.కు మృతదేహం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు గోపాలపట్నం పోలీసులు.

బీచ్ లో బైక్ డ్రైవ్ చేసిన యువకులకు షాక్
విశాఖపట్నంలోని అప్పికొండ బీచ్ లో బైక్ డ్రైవ్ చేసిన యువకులకు షాక్ ఇచ్చారు పోలీసులు. రైడ్ చేసిన శ్రీనగర్ కు చెందిన అవినాష్ , వర్మ, రోహిత్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్యూక్ , పల్సర్ బైకులు సీజ్ చేశారు. రాష్ డ్రైవింగ్ , రహదారులపై బైక్ విన్యాసాలు, స్టంట్స్ చేసినా….ప్రజలకు ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీంతో షాక్ అయ్యారు యువకులు.


50 వేలు లంచం తీసుకుంటూ..

ఏలూరు జిల్లాలో ఏసీబీ వలలో చిక్కాడు దెందులూరు సెక్షన్ ఏఈ మల్లుల రమేష్ బాబు.. ఎలక్ట్రికల్ పనులకు సంబందించిన బిల్లు లను ప్రాసెస్ చేయదనికి 50వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ T.శ్రీనివాసరావు. దీంతో రంగంలోకి దిగింది ఏసీబీ టీం. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఎఇ రమేష్..