Site icon NTV Telugu

YS Jagan: నాగమల్లేశ్వరావు కుటుంబానికి జగన్‌ పరామర్శ.. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఘటన..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: పల్నాడు జిల్లా పర్యటనలో రెంటపాళ్ళ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్న.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం పక్కకుపోయి.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. అందుకు‌ నిదర్శనం నాగమల్లేశ్వరావు ఘటనే అన్నారు. రెంటపాళ్ల నా పర్యటన అందుకు కారణం అన్నారు జగన్‌.. ఇక, నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యపై వివరిస్తూ.. రెంటపాళ్లలో నాగమల్లేశ్వరావు వైసీపీ నాయకుడు.. గ్రామ ఉప సర్పంచ్.. పోలింగ్ రోజునుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారు. వారికి అనుకూలంగా వున్నవారికి పోస్టింగ్ ఇప్పించుకున్నారు.. 2024 జూన్ లో కౌంటింగ్ రోజున తప్పుడు ఆరోపణలు చేసి నాగమల్లేశ్వరావు ను స్టేషన్ కు తీసుకెళ్ళారు.. ఫలితాలు వచ్చాక నాగమల్లేశ్వరావును ఊర్లోకి రావడానికి వీల్లేదని సీఐ రాజేష్ చెప్పారు.. కాల్చి చంపుతామని బెదిరించారు.. జూన్ 5 వరకూ స్టేషన్ లో ఉంచి అవమానించారు, బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Suryakumar Yadav: హెర్నియా సమస్యతో బాధపడుతున్న కెప్టెన్.. సర్జరీ తప్పదా..?

నాగమల్లేశ్వరావు గుంటూరులో ఉన్న సోదరుడు ఇంటికి వెళ్లాడు.. అక్కడనుంచి తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్ చేశాడు.. తనను పోలీసులు ఏ విధంగా వేధించింది చెప్పారని వెల్లడించారు వైఎస్‌ జగన్‌.. తన కొడుకును కాపాడుకునేందుకు కొడుకును ఆసుపత్రిలో చేర్పించారు.. నాగమల్లేశ్వరావుకు భార్య, కూతురు ఉంది. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెబుతారు చంద్రబాబు అంటూ సీఎంను నిలదీశారు.. కులప్రస్తావన తీసుకొచ్చి ఒకమనిషి చావుకునకారణమయ్యారు.. ఏడాదిగా కుటుంబం విషాదంలో ఉంది.. నాగమల్లేశ్వరావు ఇంటిపై రాళ్లతో దాడి చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు..? నాగమల్లేశ్వరావు తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు..

Read Also: Thummala Nageswara Rao: అప్పటిలోగా అకౌంట్లలో రైతు భరోసా నిధులు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..!

పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ ప్రాణాలకోసం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.. సీఐ, ఎస్సై లక్ష్మీనారాయణ ను స్టేషన్ కు పిలిచి వేధించారని మండిపడ్డారు జగన్.. రెండు నెలల తర్వాత డీఎస్పీ పిలిపించారు.. మీరు చట్టం కాపాడడానికి ఉన్నారా? లేదా? అని నిదీశారు.. కమ్మ పుటుక పుట్టావా అని అవమానించారు.. దీంతో, లక్ష్మీనారాయణ పురుగుమందుతాగి సూసైడ్ వీడియో తీసుకున్నారు.. తన చావుకు ఎవరు కారణమో అంతా చెప్పేశాడు.. నాగమల్లేశ్వరావు విషయంలో, లక్ష్మీనారాయణ విషయంలో చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా? అని ప్రశ్నించారు.. వ్యతిరేకంగా మాట్లాడితే వెంటాడి వేధించి చివరకుబప్రాణాలు తీసుకునేలా చెస్తారు.. ఏం పాపం చేశారని వారి ప్రాణాలు బలితీసుకున్నారు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్..

Exit mobile version