Site icon NTV Telugu

Tragedy: బావిలో స్నానానికి దిగి ఇద్దరు శివ మాలధారులు మృతి..

Swimming

Swimming

పల్నాడులో విషాదం చోటు చేసుకుంది. బావిలో స్నానానికి దిగి ఇద్దరు శివ మాలధారులు స్వాములు మృతి చెందారు. ఈ ఘటన వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శివ మాల వేసుకున్న మొత్తం ముగ్గురు స్వాములు స్నానం చేయడం కోసమని దిగుడు బావిలోకి దిగారు. ఈ క్రమంలో స్వాములు గల్లంతు కాగా.. ప్రమాదవశాత్తు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో జిడ్డు మల్లికార్జున (22), కామసాని రామకృష్ణ (27) ఉన్నారు. మరో స్వామి సురక్షితంగా బయటపడ్డాడు.

Read Also: Guntur: విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి

కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకునన్న రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. పది మోటారు ఇంజన్ల సహాయంతో బావిలో నీరు బయటకు తోడుతున్నారు. అయితే.. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు.. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: US: యూఎస్‌ బీచ్‌లో అరుదైన ఫిష్ గుర్తింపు.. భారీ విపత్తుకు సిగ్నలా..!?

Exit mobile version