NTV Telugu Site icon

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినిపై రైతుల ఫిర్యాదు.. ఆమె మామ, మరిదిపై కూడా..!

Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి విడదల రజినిపై వరుసగా ఫిర్యాదులు వెళ్తున్నాయి.. మాజీ మంత్రి రజినిపై చిలకలూరిపేట పబ్లిక్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు పసుమర్రు రైతులు.. రజినితో పాటు ఆమె మామ, మరిదిపై కూడా కంప్లైట్‌ చేశారు.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. పసుమర్రులో రోడ్డును ఆక్రమించుకుని రజిని మామ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఆక్రమించుకన్న స్థలానికి గోడకట్టారని.. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే విడదల రజిని మామ లక్ష్మీనారాయణ.. ఆ స్థలాన్ని పసుమర్తి పంచాయతీకి రాసిచ్చారు. మరోవైపు, విడదల లక్ష్మీనారాయణ కొడుకు రాము కోర్టుకెళ్లి స్టే తెచ్చారని ఫిర్యాదు చేశారు.. ఇక, పసుమర్రులో జగనన్న కాలనీ కోసం ప్రభుత్వం 200 ఎకరాలు పొలం కొనుగోలు చేసింది.. భూములు ఇచ్చిన రైతుల నుంచి లంచం తీసుకున్నారు. లంచం తీసుకున్న డబ్బుల్లో కొంత తిరిగిచ్చారు. ఇంకా నలభై లక్షలు ఇవ్వలేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు పసుమర్రు రైతులు..

Read Also: Deputy CM Pawan Kalyan: అడవి తల్లి బాట.. 15 ఏళ్ల పాటు కూటమి పాలన కొనసాగిలి..