Site icon NTV Telugu

Hospital Negligence: వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్‌ చేశారు.. మహిళ కడుపులోనే సర్జికల్‌ బ్లేడ్‌ మరిచారు..

Hospital Negligence

Hospital Negligence

Hospital Negligence: పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. ఆపరేషన్ తర్వాత వైద్యుల తీవ్ర నిర్లక్ష్యానికి సంబంధించిన సంఘటన చోటుచేసుకుంది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చిన 22 ఏళ్ల రమాదేవి అనే యువతికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి మరియు ఆయన సిబ్బంది. అయితే, ఆపరేషన్ తర్వాత రమాదేవికి తీవ్రమైన కడుపు నొప్పి మొదలయ్యింది. ఈ విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసినప్పటికీ, కడుపు నొప్పి సాధారణం అని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి.. లైట్‌గా తీసుకున్నారు.. కానీ, కడుపు నొప్పి తగ్గక పోవడంతో మరోసారి స్కానింగ్ చేయగా, రమాదేవి కడుపులో సర్జికల్ బ్లేడు ఉన్నట్టు స్కానింగ్‌లో చూసి షాక్‌ తిన్నారు.. ఈ విషయాన్ని తెలుసుకున్న రమాదేవి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిలో బంధువులు ఆసుపత్రి సిబ్బంది మరియు డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. న్యాయం కోసం ఆందోళనకు దిగారు.. ఆసుపత్రి నిర్వాహకులు, స్థానిక అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో, బాధితురాలికి అవసరమైన వైద్యం అందజేయడం, ఘటనపై పూర్తి విచారణ జరిపించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.

Read Also: Railway Concessions:స్టూడెంట్ ఐడీ కార్డ్ ఉంటే చాలు.. రైల్వే టికెట్ లో భారీ డిస్కౌంట్..

Exit mobile version