Saraswati Power Plant Lands: సరస్వతి భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సరస్వతి పవర్ ప్లాంట్ కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.. పలనాడు ప్రాంతంలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన భూముల్లో 24.85 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నట్లు గుర్తించింది అధికార యంత్రాంగం.. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అసైన్డ్ ల్యాండ్స్ కేటాయింపును రద్దు చేశారు.. ఆ భూములను వెనక్కి తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.. దీంతో సరస్వతి భూముల్లో నుండి 24.85 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ, ఆ భూముల రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు అధికారులు.
Read Also: Minister Seethakka: 3410 గ్రామాల్లో గ్రామసభలు.. 142 ఊళ్లలో గొడవలు చేసింది వాళ్లే..
పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన 24.84 ఎకరాల అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది ప్రభుత్వం.. చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలను రైతు నుండి కొనుగోలు చేసింది సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం. అయితే, అప్పటినుండి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న ఆరోపణలు స్థానికుల నుండి వినిపించాయి. ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా ఉన్నాయన్న వివాదం ఉండటంతో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు.. ఆ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం సరస్వతి పవర్ ప్లాంట్స్ భూములపై సర్వే చేసింది.. అయితే, ఈ భూముల్లో అటవీ భూములు తేలలేదు.. కానీ, అసైన్డ్ ల్యాండ్స్ మాత్రం బయటపడ్డాయి.
గత నవంబర్‌లో అసైన్డ్ లైన్స్ కు సంబంధించిన వ్యవహారంపై సర్వే నిర్వహించారు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు.. అయితే, ఇందులో భాగంగా వేమవరం పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు.. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నిలిలో 4.84 సెంట్లు అసైన్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు అధికారులు. దీంతో, ఈ భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్, అరుణ్ బాబు, సరస్వతీ పవర్ ప్లాంట్స్ కు రిజిస్టర్ అయిన అసైన్డ్ ల్యాండ్ ల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, బుధవారం పిడుగురాళ్ల ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ సురేష్ బాబు.. సరస్వతి పవర్ ప్లాంట్స్ భూమిలోని అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు…