NTV Telugu Site icon

Bird Flu Death in AP: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. రెండేళ్ల చిన్నారి మృతి

Bird Flue

Bird Flue

Bird Flu Death in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి బర్డ్ ఫ్లూ మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్ తో మృతి చెందింది. పచ్చి కోడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకి మరణించిందని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. గత నెల 4వ తేదీన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో మంగళగిరి ఎయిమ్స్ లో చిన్నారిని జాయిన్ చేశారు. చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే, చికిత్స అందించే సమయంలో చిన్నారి గొంతు, ముక్కు నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. నివేదిక అనుమానంగా రావడంతో పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు శాంపిల్స్ పంపారు వైద్యులు.

Read Also: Visakhapatnam: స్కూల్ పిల్లలకు తప్పిన ముప్పు.. మద్యం మత్తులో డివైడర్ను ఢీ కొట్టిన ఆటో డ్రైవర్

అయితే, చిన్నారికి హెచ్5 ఎన్1 వైరస్ గా నిర్ధారణ అయింది. బర్డ్ ఫ్లూ మృతిగా తేలడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ తో మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యుల నుంచి శ్వాబ్ శాంపిల్స్ డాక్టర్లు సేకరించారు. ముందు జాగ్రత్తగా మరిన్ని వైద్య పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. శ్వాబ్ శాంపిల్స్ ను ఎయిమ్స్, పూణే వైరాలజీ ల్యాబ్ కు అధికారులు పంపనున్నారు. చుట్టుపక్కల ఎవరూ జ్వరంతో బాధపడడం లేదని గుర్తించారు. చిన్నారి కుటుంబం నివాసం ఉండే ఇంటికి కిలోమీటరు దూరంలో మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు.

Read Also: HCU Land Issue : HCU భూముల ఇష్యూ పై స్పందించిన రేణు దేశాయ్

ఇక, ఎన్టీవీతో చిన్నారి పెదనాన్న వేణు పెండ్యాల రవి మాట్లాడుతూ.. మార్చ్ 4న పాపకి జ్వరం రావడంతో నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాం.. పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరి ఎయిమ్స్ లో జాయిన్ చేశారు.. 10 రోజుల ట్రీట్మెంట్ తర్వాత పాప చనిపోవడం జరిగింది.. వైద్యులకు అనుమానం వచ్చి పూణే ల్యాబ్ కి రక్త నమూనాలు పంపించారు. నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటికి వచ్చి మీ పాప బర్డ్ ఫ్లూ వ్యాధితో చనిపోయింది అని చిన్నారి పెద్దనాన్న చెప్పారు.