Vidadala Rajini: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నే త, మాజీ మంత్రి విడదల రజినిపై మరో ఫిర్యాదు పోలీసులకు అందించింది.. గత ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించారని.. వారి నుంచి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగాలు రావడంతో.. ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్ పల్లె జాషువా, విడదల రజిని మరిది విడదల గోపి, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణలపై కేసు నమోదైన విషయం విదితమే…
Read Also: Mazaka : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మజాకా.. ఎక్కడ చూడాలంటే.?
ఇప్పుడు, విడదల రజిని, ఆమె మరిది విడదల గోపీపై ఎస్పీకి మరో ఫిర్యాదు అందింది.. ఇద్దరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు చిలకలూరిపేటకి చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం.. 2022 ఏప్రిల్ లో రజిని అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.. వంద మంది వచ్చి తనపై దాడి చేసి, ఇంట్లో ఫర్నిచర్, కారుని ధ్వంసం చేశారన్న ఆయన.. మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించి, తనని, తన కుటుంబాన్ని మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు.. అయితే, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా నామమాత్రంగా కేసు కట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు.. రజిని, ఆమె మరిది గోపి పేర్లు FIR లో చేర్చి.. తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు బాధితుడు సుబ్రమణ్యం.