AP Young Man Died in USA: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మరో యువకుడు అమెరికాలో మృతిచెందాడు.. ఎనిమిది నెలలుగా బోస్టన్ లో ఉద్యోగం చేస్తున్న మార్టూరుకు చెందిన యువకుడు పాటిబండ్ల లోకేష్.. బోస్టన్ సిటీలో ఈతకొలనులో పడి మృతిచెందాడు.. బాపట్ల జిల్లా , మార్టూరు గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారి పాటిబండ్ల వేణుబాబు, శాంతి దంపతుల కుమారుడు పాటిబండ్ల లోకేశ్.. అతడి వయస్సు 25 సంవత్సరాలు.. గత మూడు సంవత్సరాలుగా అమెరికాలో బోస్టన్ సిటీలో ఉంటున్నట్లు బంధువులు వెల్లడించారు. ఎంఎస్ రెండు సంవత్సరాల చదువు పూర్తిచేసిన తర్వాత కొద్ది నెలలు ఖాళీగా ఉండి.. గత ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం సాధించాడు.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయి.. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపాడు.. ఈ నెల 3వ తేదీన స్నేహితులతో కలిసి బోస్టన్ లోని ఈతకొలను దగ్గరకు వెళ్లాడు.. ఇక, ఈత కొడుతూ కొలనులో పడి మృతి చెందాడు.. గురువారం రాత్రి మార్టూరులోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అతడి స్నేహితులు.. ఇక, మృతదేహాన్ని మార్టూరు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు బంధువులు వెల్లడించారు.
Read Also: IP68 రేటింగ్, ప్రీమియం ఫీచర్లతో Samsung Galaxy Tab S11, S11 Ultra లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
