పామాయిల్ రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఏరియా రెండు వందల మంది ఫామ్ ఆయిల్ రైతులు తెలంగాణ మాజి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సరిహద్దు గ్రామాల ప్రజలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. అల్లిపల్లి గ్రామంలొ సమావేశం నిర్వహించారు పామాయిల్ రైతులు. తెలంగాణ ప్రాంతంతో పోల్చితే ఆంధ్రా ప్రాంతంలొ టన్నుకు 3 వేలు రూపాయలు వ్యత్యాసం వుండటంతో చింతలపూడి ఏరియా రైతులు గగ్గోలు పెడుతున్నారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుని ఆశ్రయించిన ఫామ్ అయల్ రైతులు తమకు న్యాయం చేయాలని కోరారు.
గోద్రేజ్ కంపెని ప్రతినిదులతొ మాట్లాడిన తుమ్మల సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పామాయిల్ రైతులతో తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. సీతానగరం లో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ ఆంధ్రా రైతులకు తెలంగాణ రైతులకు పామాయిల్ ధరలో వ్యత్యాసం చూపిస్తుందని, దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణాలో పామాయిల్ గెలలు ధర నెలకు ముందే ప్రకటిస్తుండగా ఆంధ్రాలోని సీతానగరం పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం గెలలు దింపిన నెల రోజుల తర్వాత ధరను ప్రకటిస్తున్నారని చెప్పారు.
Read Also: Revanth Reddy : అందరం సర్పంచ్‌గా పోటీ చేస్తున్నామనుకొని కష్టపడాలి
దీనివల్ల తమ ఖాతాల్లో ఎంత జమ చేస్తున్నారో తెలియడం లేదని వాపోయారు. గెలలు ఎక్కువగా దిగుమతి అవుతున్న సీజన్ లో ధర తగ్గించి దిగుమతి తగ్గినప్పుడు ధర పెంచుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఉన్న గోద్రేజ్ ఫ్యాక్టరీ పరిధిలో 11 తెలంగాణ మండలాలు ఉన్నాయని ఆ రైతులకు తెలంగాణ ధర ఇచ్చి ఆంధ్రా రైతులకు తక్కువ ధర ఇస్తున్నారని తెలిపారు. తాము ఎక్కువగా వచ్చిన ప్రాంతంలో గెలలు విక్రయించుకునే ప్రయత్నం చేస్తుండగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారని చెప్పారు.
ఒకే ఫ్యాక్టరీలో తెలంగాణ రైతులకు ఒక ధర, ఆంధ్రా రైతులకు మరోధర ఇవ్వడం ఏంటని దానిని పరిష్కరించాలని అధికారులు, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక తాము సహించేది లేదని ఎక్కడ ఎక్కువ ధర ఇస్తే అక్కడే పామాయిల్ గెలలు విక్రయిస్తామని అడ్డుకుంటే తాము వారిపై తిరగబడతామని రైతులు చెప్పారు. దీనిపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి నేను ఉన్నతాధికారులు, నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరో పది రోజులు చూస్తామని సమస్యలు పరిష్కారం చేయకపోతే తాము తెలంగాణ ఫ్యాక్టరీ కే గెలలు తరలిస్తామని రైతులు తెలిపారు.
Read Also: Cotton Prices: ఏనుమామూల మార్కెట్లో పత్తి రైతుల ఆనందం