NTV Telugu Site icon

Payyavula Keshav: పుట్టబోయే పిల్లలకు కూడా జగన్ పేరు పెడతారా?

Payyavula Kesha

Payyavula Kesha

ఏపీలో ఒకవైపు అసెంబ్లీ, మండలి సమావేశాలు తుదిదశకు చేరుకున్నాయి. టీడీపీ-వైసీపీ నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్ పేరు మార్చడం కుదరదని టీడీపీ పట్టుబడుతోంది. టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టబోయే పిల్లలకు కూడా జగన్ పేరు పెట్టాలని జీవో తెచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.ఇవాళ వచ్చే కాగ్ నివేదికల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎన్టీఆర్ పేరు తొలగింపు అంశాన్ని తెరపైకి తెచ్చారు.

Read Also: S. S. Rajamouli :ట్రిపుల్ ఆర్`కు `ఆస్కార‌`ం ఉంది!

ఇప్పటికే మాంసం కొట్ల నుంచి మరుగుదొడ్ల వరకూ జగన్ పేరు పెట్టుకుంటున్నారు.సొంత పార్టీ నేతలకు ఆన్లైన్ ఓటింగ్ పెడితే ఎన్టీఆర్ పేరు తొలగింపును వ్యతిరేకిస్తారు. స్టిక్కర్ సీఎం గా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారు.. రాష్ట్రంలో వైఎస్సార్, జగన్ పేరు తప్ప మరో పేరు పెట్టకూడదా..?ఎన్నో ప్రభుత్వాలకు ఎన్టీఆర్ మార్గదర్శకంగా నిలిచారు. ఎన్టీఆర్ ఆలోచనలతో పుట్టి ఆయనే ఛాన్సలరుగా కొనసాగిన యూనివర్సిటీ కి పేరు తొలగిస్తారా? చేసే పనికంటే పేర్లు మార్చేందుకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. వైద్య రంగంతో పాటు అనేక రంగాలకు ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు ఆదర్శంగా వున్నాయన్నారు.

Read Also: Congress President Election: సోనియాతో సమావేశం కానున్న అశోక్ గెహ్లాట్.. జోడు పదవులు నిర్వహించే ఆలోచన

Show comments