Site icon NTV Telugu

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం..

సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యల పై చర్చించనున్న క్యాబినెట్.. కొత్త పీఆర్సీ జీవోలను ర్యాటిఫై చేయనుంది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు కి ఆమోదం తెలపనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్.. కరోనా మహమ్మారి తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాల పై ఆమోదం తెలపనుంది.

ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకంకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగుల కు కేటాయింపుకు ఆమోదం తెలుపనున్న సమాచారం అందుతోంది. ఉద్యోగులకు 20 శాతం రిబెట్, పెన్షనర్ల కు 5 శాతం ప్లాటులు కేటాయింపుకు ఆమోదం తెలపనుంది ఏపీ క్యాబినెట్. ఈ బీసీ నేస్తం అమలుకు కూడా ఆమోదం తెలపనున్న క్యాబినెట్.. పెన్షన్లను 2,250 నుండి 2,500 కి పెంచిన ఉత్తర్వులను ఆమోదించనుంది. అలాగే కరోనా కట్టడిపై చర్చించనున్నారు.

Exit mobile version