NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో కలకలం.. ఐదేళ్ల బాలుడి కిడ్నాప్

Tirumala Kidnap

Tirumala Kidnap

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం రేగింది. శ్రీవారి ఆలయం సమీపంలో ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌కు గురైన బాలుడిని తిరుపతి దామినీడుకు చెందిన గోవర్ధన్ రాయల్‌గా పోలీసులు వెల్లడించారు.

కాగా ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు బాలుడు తప్పిపోగా రాత్రి 7:11 గంటలకు బాలుడిని తీసుకుని మహిళ తిరుమల నుంచి తిరుపతికి పారిపోయింది. అనంతరం మహిళ తిరుపతిలో ఏపీ03 జెడ్ 0300 నంబరు గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే ఇంకా బాలుడి ఆచూకీ తెలియరాలేదు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరికైనా బాలుడి జాడ తెలిస్తే 9440796769, 9440796772 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Fake Phonepay: నకిలీ ఫోన్ పే.. టెక్నాలజీ సాయంతో యువకుడి మోసాలు

Show comments