NTV Telugu Site icon

Telugu Talli Flyover Accident: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

Vizag Telugu Talli Flyover

Vizag Telugu Talli Flyover

One Dead Two Injured In Vizag Telugu Talli Flyover Accident: విశాఖపట్నంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా హేరియర్ వాహనం అతివేగంగా దూసుకొస్తూ.. ఫ్లైఓవర్ మీద వెళ్తున్న ఓ బైకు, స్కూటీలను ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయాడు. దీంతో.. అతని తలకి బలమైన గాయాలు తగిలాయి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టాటా హేరియర్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో స్కూటీ నుజ్జునుజ్జు అయ్యింది. సంఘటన స్థలానికి లా అండ్ ఆర్డర్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

Twitter: రోజుకు 600ట్వీట్లు మాత్రమే చదవగలరు.. ఎలాన్ మస్క్ కొత్త రూల్

మరోవైపు.. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఫ్లైఓవర్ పై నుండి కిందపడిన జై కృష్ణ అనే వ్యక్తికి తలకు బలమైన గాయాలు కావడంతో, చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు విజయవాడకు చెందినవాడు. మరో ఇద్దరిని యశ్వంత్ (అల్లిపురం), హరి కుమార్ (అక్కయ్యపాలెం)లుగా గుర్తించారు. వీళ్లిద్దరు విద్యార్థులను తేలింది. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు వీరికి మెరుగైన సేవలు అందించి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. మద్యం మత్తులో కారుని నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు AP 39 LF 5999 నెంబర్ గల టాటా హేరియర్ కానుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..

Show comments