Site icon NTV Telugu

ఒంగోలులో ఒమిక్రాన్ కేసుల కలకలం..

ప్రకాశం : ఒంగోలులో ఒమిక్రాన్ కేసుల కలకలం రేపింది. నగరంలోని భాగ్యనగర్ 4వ లైనులోని ఓ అపార్ట్మెంట్ లో రెండు కేసులు నమోదయ్యాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారింది ఓ ఆడియో. ఇప్పటి వరకు విదేశాల నుండి వచ్చిన 784 మందిని గుర్తించారు వైద్యశాఖ అధికారులు. 400 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. మరో 384 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

విదేశాల నుండి తిరిగి వచ్చి ట్రేస్ అవుట్ కాని వారు 48 మంది ఉన్న‌ట్లు స‌మాచారం. భాగ్య నగర్ నాల్గవ లైన్ లో అమెరికా నుండి తిరిగి వచ్చిన ఇద్దరికి, కెనడా నుండి వచ్చిన మరొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ లోని సీసీఎంబీ లాబ్ కు పంపారు వైద్యశాఖ అధికారులు. అయితే..ఓ ఆడియో వైర‌ల్ కావ‌డంతో స్థానికుల్లో ఆందోళన నెల‌కొంది. హైదరాబాద్ ల్యాబ్ నుండి రిపోర్టులు వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందంటున్నారు డీఎంహెచ్ఓ..

Exit mobile version