సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్‌లో అడుగుపెట్టింది.. క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూనే ఉంది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే కాగా… తాజాగా, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఒమిక్రాన్ వెలుగు చూసింది… తూర్పు గోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.. దీంతో.. కోనసీమలో కలకలం మొదలైంది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. బాధితురాలు ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చినట్టుగా చెబుతున్నారు అధికారులు.. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. ఆమెతో కాంటాక్ట్ అయినవాకి టెస్ట్‌లు చేయడంపై ఫోకస్ పెట్టారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది.
కోనసీమలో ఒమిక్రాన్ కలకలం..
