సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే.. ఘటనా స్థలానికి వెళ్లినవారు సహాయక కార్యక్రమాలు పాల్గొంటారు.. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తారు.. అయితే, ప్రమాదానికి గురైన వాహనాన్ని బట్టి, అందులో ఉన్న వస్తువలనుబట్టి కూడా వారి ఆలోచన మారిపోతుంది.. గతంలో.. లిక్కర్ డోల్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడితే.. అటుగా వచ్చినవారంతా.. అందినకాడికి లిక్కర్ బాటిళ్లు ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి.. ఇక, కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్ బోల్తా పడితే.. దొరికనకాడిన కోళ్లను చంకలో పెట్టుకుని వెళ్లిపోయారు.. ఇప్పుడు అలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో జరిగింది.
Read Also: Godavari Floods: వరద కష్టం పోయింది.. బురద కష్టం మిగిలింది..
పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద ఇవాళ ఉదయం ప్రమాదం జరిగింది.. అదుపుతప్పిన ఆయిల్ లోడుతో వెళుతున్న లారీ బోల్తా కొట్టింది.. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా అన్నట్టుగా.. సమీప గ్రామాలకు వ్యాపించింది.. వెంటనే క్యాన్లతో ప్రమాద స్థలానికి చేరుకున్నారు స్థానికులు.. ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిన్‌లో తమ క్యాన్లలో నింపుకోవడానికి ఎగబడ్డారు.. క్యాన్లు, బకెట్లు చివరకు ప్లాస్టిక్ బిందెలతో కూడా అక్కడికి చేరుకున్నారు.. ఆయిల్ నింపుకోవడానికి పురుషులు, మహిళలు, చిన్నారులు, ముసళ్లు అనే తేడా లేకుండా పోటీ పడ్డారు.. ఓవైపు ట్యాంకర్‌ను యథాస్థితికి తీసుకెళ్లేందుకు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మరోవైపు.. క్యాన్లు, బకెట్లతో అక్కడి వేచిచూస్తున్నారు.. చెన్నై నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది.. మొత్తంగా.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.