NTV Telugu Site icon

Occult Worship in College Bus: కాలేజీ బస్సులో క్షుద్ర పూజల కలకలం.. అమ్మాయిల కోసమేనా..?

Occult Worship

Occult Worship

Occult Worship in College Bus: ఓవైపు టెక్నాలజీ వైపు ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒక చోట క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా కాలేజీ బస్సులోనే క్షుద్రపూజలు చేయడం కలకలం సృష్టిస్తుంది.. ఈ ఘటనతో ఏలూరు జిల్లా నూజివీడులో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.. బస్సులో నిజంగా క్షుద్రపూజలు చేశారా? లేక ఆకతాయిల పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Jio Valentine’s Day Offer: ప్రేమికుల రోజు.. ‘జియో’ ఆఫర్ల జల్లు..

ఏలూరు జిల్లా నూజివీడులో కాలేజీ బస్సులోనే జరిగిన క్షుద్రపూజలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో వికాస్ కాలేజీ బస్సులో అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. స్థానిక ఆంజనేయస్వామి గుడి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కాలేజీ బస్సులో అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.. బస్సులో ఓ పటం వేసి.. దానిపై నిమ్మకాయలు, అన్నం ముద్దలు పెట్టి క్షుద్ర పూజలు చేశారు.. బస్సు మధ్యలో ముగ్గులు వేసి నిమ్మకాలు ఉంచి పూజలు చేయడమే కాకుండా.. బస్సు లోపల డ్రైవర్‌ వెనుకాల ఉండే బోడుకు నిమ్మకాయల దండ, మరికొన్ని ఆకులు గుచ్చి దండగా వేసి పూజలు చేసినట్టు కనిపిస్తోంది.. బస్సు లోపలి నుంచి టాప్‌ భాగంతో పాటు.. ఇరువైపుల ఉండే అద్దాలకు కూడా హస్తం ముద్రలు కనిపిస్తున్నాయి.. ఈ పూజలు చేసిన ఆనవాళ్లు చూసి భయాందోళనలో విద్యార్థులు ఉండగా.. మరో బస్సులో విద్యార్థులను కాలేజీకి తరలించింది సదరు కాలేజీ యాజమాన్యం. ఓవైపు ప్రేమికుల రోజు జరుగుతుండగా.. ఇవాళే ఈ పూజలకు పూనుకున్నారంటే.. ఎవరైనా అమ్మాయిల కోసం పూజలు చేసి ఉంటారా? లేదా కాలేజీ యాజమాన్యం అంటే గిట్టనివాళ్లు చేసిన పనా? ఆకతాయిలే ఇలా విద్యార్థులను భయపెట్టడానికి చేశారా? అనేది తేలాల్సి ఉంది.