NTV Telugu Site icon

NV Ramana : ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే

Nv Ramana

Nv Ramana

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను టీడీపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వేడుకల్లో సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు తిరుపతితో ఎంతో అనుబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని, ఆయన ఓ సమగ్ర సమతా మూర్తి అని ఎన్వీ రమణ కొనియాడారు. రైతుబిడ్డగా, రంగస్థల నటుడిగా, కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగారని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం దక్కించుకున్న సంచలన వ్యక్తి ఎన్టీఆర్… ఎన్టీఆర్‌తో నాకు సన్నిహిత సంబంధం ఉండేది… నాపై ఎన్టీఆర్ మనిషి అని ముద్ర వేశారు.

దానికి నేను గర్విస్తున్నాను… కాలేజీ చదివే రోజుల్లోనే నేను ఆయన్ను అభిమానించే వాడిని… 1983లో ఆయన కోసం పరోక్షంగా పనిచేశాను…. సంక్షోభ సమయంలో ఆయన తరపున వాదించడానికి కూడా ఎవ్వరూ రాలేదు. కానీ ప్రజాభిమానం తో ఆయన తిరిగి పదవి దక్కించుకున్నారు.. అధికారం పోయాక ఆయన వెంట ఎవ్వరూ రాలేదు. అది నేను దగ్గరగా చూసాను.. అప్పట్లో ఢిల్లీకి ఎన్టీఆర్ నన్ను తీసుకెళ్లే వారు… ఆయనకు నేను మందులు అందించేవాడిని… రిటైర్డ్ అయ్యాక ఎన్టీఆర్ పైన పుస్తకం రాస్తాను… నన్ను ఎన్టీఆర్ నాన్న అని పిలిచేవారు…. వ్యక్తిగత, కుటుంబ విషయాలలో ఆయనకు న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాడిని అని ఆయన పేర్కొన్నారు.

Show comments