ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. ఇరుదేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
ఏపీ హైకోర్టులో ఉదయం 10:30 గం.లకు ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. న్యాయమూర్తులచేత ప్రమాణం చేయించనున్నారు సీజే జస్టిస్ పీకే మిశ్రా. జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ,జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు,జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి,జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ వడ్డిబోయిన సుజాత ప్రమాణం చేస్తారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన PSLV C52 ప్రయోగం విజయవంతమైంది. 25.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా ఉ.5.59 గం.కు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.18.31 నిమిషాల పాటు ప్రయాణించిన రాకెట్.. 1710 కిలోల బరువున్న IRSAT-1 తోపాటు మరో రెండు ఉపగ్రహాలను నిర్ణిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.ఈ ఉపగ్రహాలు 10 ఏళ్ల పాటు వ్యవసాయం, అటవీ, నీటివనరుల నిర్వహణ, వరదలపై విలువైన సమాచారం అందించనున్నాయి.
తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా తగ్గాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు. కొమురం భీం జిల్లా కెరమెరిలో 8.8 డిగ్రీలు నమోదయింది. వాంకి డి లో 9.3 డిగ్రీలు, సోనాలలో 9.5 డిగ్రీలు. బజార్ హత్నూ ర్ లో 9.9 డిగ్రీలు, ర్యాలీలో 10.2, పెంబిలో 10.4 డిగ్రీలు నమోదయ్యాయి.
భగవత్ శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వైభవాన్ని పురస్కరించుకొని… రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 2న మొదలైన సమతామూర్తి వేడుకలు 11 రోజులుగా… ఎంతో కన్నుల పండువగా సాగాయి. ఇవాళ్టితో వేడుకలు ముగియనున్నాయి. యాగశాలలో జరగనున్న సహస్ర కుండలాల యజ్ఞానికి మహాపూర్ణహుతి పలుకనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు.
రాష్ట్రంలో గిరిజన తెగలు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ జిల్లాతో పాటు జనగామలో పోక్సో కోర్టుల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. పోక్సో చట్టం పకడ్బందీగా అమలయ్యేలా తెలంగాణ సర్కార్ అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. బాధిత పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా వీలైనన్ని పోక్సో కోర్టులను ఏర్పాటు చేస్తోంది.