Site icon NTV Telugu

కోవిడ్ బాధితులకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ట్రస్ట్

కరోనా బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం మొదలుపెట్టింది. కోవిడ్ బాధితులు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కరోనాకు వైద్యం సాయం పొందేలా ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేకంగా ఒక నంబరును కేటాయించింది. కరోనాకు టెలీమెడిసిన్ సాయం కావాలనుకునే వారు 8801033323 నెంబ‌రుకు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని ఎన్టీఆర్ ట్రస్ట్ సూచించింది. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వారి మొబైల్ ఫోన్‌కు టెలిమెడిసిన్ సేవ‌లు అందించించే జూమ్ కాల్ లింక్ వెళ్తుంది. తద్వారా కోవిడ్ బాధితులు జూమ్ లింక్ ద్వారా టెలీమెడిసిన్ సేవ‌లు పొంద‌వ‌చ్చు.

Read Also: అత‌ని వ‌య‌స్సు 66.. సంతానం 129 మంది

అవ‌స‌రం ఉన్న కోవిడ్ బాధితుల‌కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ నుంచి ఉచితంగా మందుల పంపిణీ కూడా జ‌రుగుతుంది. ప్రతిరోజూ ఉద‌యం 7:30 గంట‌లకు కోవిడ్ బాధితుల‌కు జూమ్ వీడియో కాన్ఫ‌రెన్స్ ఉంటుంది. మిస్డ్ కాల్ ద్వారా వైద్య సౌక‌ర్యం శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుంద‌ని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ప్ర‌క‌టించింది. ఈ అవకాశాన్ని కోవిడ్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

Exit mobile version