MLA Kolikapudi: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హంగామా సృష్టించాడు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై దాడికి యత్నించిన అదే పార్టీకి చెందిన కందిమల్ల సాయి సుమిత్, పానుగంటి వెంకట్, మరో నలుగురు వ్యక్తులు.. తనపై దాడి నుంచి తప్పించుకునే యత్నంలో సాయి సుమిత్ పై సీసాతో కొట్టిన రామకృష్ణ. ఇక, సాయి సుమిత్ ఫిర్యాదుతో సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఉదయం తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మీలను పీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కూడా రామకృష్ణ తల్లి, సోదరుని స్టేషన్ లోనే ఉంచడంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు.
Read Also: Anil Kumar Yadav Mining Case: మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ ఉచ్చు.. త్వరలో కేసు నమోదు చేసే ఛాన్స్
అయితే, అసలు రామకృష్ణ ఇంటిపై దాడికి వచ్చిన సాయి సుమిత్.. దాడికి యత్నించిన వారిని విడిచిపెట్టి ఆత్మరక్షణ కోసం దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టడం అమానుషం అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. దాడి జరిగితే కేసులు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. కానీ, సాయి సుమిత్ వెనుక కొందరు ఉండి ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణపై ఒత్తిడి తెచ్చి అన్యాయంగా అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆరోపించారు. తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని ఇది సరైన విధానం కాదన్నారు. గంజాయి విక్రయించాలంటూ తమ కుమారుడ్ని ప్రోత్సహిస్తూనే అక్రమ కేసుల్లో బనయించారని ఎమ్మెల్యే ముందర ఓ బాధిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్ కి పిలిపించాలని అంతవరకు కదిలేది లేదని స్టేషన్ లోనే ఎమ్మెల్యే కొలికపూడి కూర్చున్నారు. గత నెల రోజుల క్రితం ఇదే రామకృష్ణపై గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఇంత వరకు చర్యలు లేదని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
