NTV Telugu Site icon

Black Magic: ఎన్టీఆర్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..

Black Magic

Black Magic

ఎంత టెక్నాలజీ వచ్చినా.. మూఢ నమ్మకాలు అనేవి కనుమరుగవడం లేదు. మూడనమ్మకాలు, క్షుద్రపూజలు జనాలను ఇంకా భయపెడుతున్నాయి. వ్యాపారం, ఆరోగ్యం, డబ్బులు బాగా సంపాదించాలని ఇలా అనేక వాటికి జంతువులను బలిస్తున్నారు. మూఢ నమ్మకాలపై పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా కనీసం చైతన్యం రావడం లేదు. తాజాగా.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో వజ్రాలగుట్ట దగ్గర క్షుద్రపూజల కలకలం రేపుతుంది.

Read Also: Aishwarya Rai : పెళ్లికి ముందే మగబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్ .. షాకింగ్ విషయం వెలుగులోకి?

వివరాల్లోకి వెళ్తే.. క్షుద్ర పూజలు చేసిన స్థలంలో ఓ మేకను బలిచ్చి పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తమ వ్యాపారం పెరగాలంటూ పేపర్‌పై రాసి పూజలు చేయడం చర్చనీయాంశమైంది. కొన్నేళ్లుగా గుడిమెట్లలో వజ్రాల కోసం వెతుకులాట కొనసాగుతుంది. తాజాగా ఇలా క్షుద్ర పూజలు చేసి మరీ.. వజ్రాల కోసం వేటాడుతుండటంతో స్థానికులు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తన 3 మేకలు మూడు రోజులుగా కనిపించడం లేదంటూ నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి కోసం వెతుకుతుండగా తన మేకలనే బలిచ్చినట్లుగా ఆనవాళ్లు కనిపించాయని అంటున్నాడు. నాగరాజు ఫిర్యాదుపై క్షుద్రపూజలు జరిగిన ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Read Also: Gudivada Amarnath: సూపర్ సిక్స్ అన్నారు.. సింగిల్ రన్ కూడా తీయలేదు.. మాజీ మంత్రి విమర్శలు

Show comments