MLA Vasantha Krishna Prasad: వైఎస్ జగన్ మార్గదర్శకత్వంలో జోగి రమేష్, జనార్ధన్‌రావు నకిలీ మద్యం వ్యాపారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాలు బయటపెడితే మరెన్నో వాస్తవాలు తెలుస్తాయన్నారు.. నకిలీ మద్యంపై జోగి రమేష్ అనుచరుడే సమాచారం ఇచ్చారు.. జోగి రమేష్ అనుచరుడు సురేష్ ఎక్సైజ్‌శాఖకు తెలిపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.. జోగి రమేష్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. కుట్రలు చేసి టీడీపీ నాయకులపై నెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..
Read Also: Ananthapur : అనంతపురం జిల్లాలో సీఐ రాజు వివాదం.. పోలీస్ వ్యవహారంపై వేడెక్కుతున్న చర్చలు !
ఇక, వైఎస్ జగన్ పాలనలో జరిగిన మద్యం స్కామ్ నుంచి దృష్టి మళ్లించడానికి నకిలీ మద్యం కేసు తెరపైకి తెచ్చారని ఆరోపించారు వసంత కృష్ణప్రసాద్.. నాడు మంత్రి పదవి కోసం చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ వెళ్లారు.. నేడు జోగి రమేష్‌ను వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నకిలీ మద్యం స్కామ్‌లో భాగస్వామిని చేశారని దుయ్యబట్టారు.. నకిలీ మద్యం కుంభకోణంలో వైఎస్ జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. కాగా, నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్ధన్‌రావు.. తాను జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని ఓ వీడయోలో పేర్కొన్న విషయం విదితమే.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నకిలీ మద్యం తయారీ ఆపేశామని.. కానీ, మళ్లీ జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేయడం మొదలు పెట్టానంటూ జనార్ధన్‌రావు వీడియో పేర్కొనడం కలకలం సృష్టించింది.. అయితే, ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. మరోవైపు, జనార్ధన్‌రావు వీడియోపై స్పందించిన జోగి రమేష్.. ఇదంతా చంద్రబాబు కుట్రగా అభివర్ణించిన విషయం విదితమే..
