NTV Telugu Site icon

VRO Missing Mystery: మిస్టరీగా వీఆర్వో మిస్సింగ్‌ వ్యవహారం..

Vro

Vro

VRO Missing Mystery: ఎన్టీఆర్ జిల్లాలో మిస్టరీగా మారింది వీఆర్వో అశోక్‌ మిస్సింగ్ వ్యవహారం.. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు ఇబ్రహీంపట్నం వీఆర్వో అశోక్.. ఇబ్రాహీంపట్నం తహసీల్దార్, ఆర్‌ఐ తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. వారి ఇబ్బందులు తట్టుకోలేక.. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఉద్యోగుల గ్రూప్ లో మెసేజ్ పెట్టిన అశోక్‌.. ఆ తర్వాత అదృశ్యమయ్యారు.. అయితే, అశోక్ పై వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు మందలించారనే.. ఆ తర్వాతే అశోక్‌ కనిపించకుండా పోయాడని ఉద్యోగులు చెబుతున్నారు.. ఇక, రెండు రోజులు గడిచినా తన భర్త అశోక్‌ ఇంటికి రాకపోవడంతో.. ఆందోళన వ్యక్తం చేస్తుంది ఆయన భార్య ప్రియాకం.. ఈ వ్యవహారంపై ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.. అయితే, ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూప్‌లో ఆత్మహత్య చేసుకుంటానంటూ మెసేజ్‌ పెట్టి అదృశ్యమైన అశోక్‌..! ఎక్కడికైనా వెళ్లిపోయాడా.. ? లేదా జరగకూడనిది ఏమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.. కాగా, గతంలోనూ ఓ అధికారి అదృశ్యమై.. ఆ తర్వాత మృతదేహమై తేలిన విషయం విదితమే.. ఆ అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందంటున్నారు..

Read Also: Pushpa 2 : పుష్ప 2లో ఏడిపించనున్న శ్రీవల్లి.. ఈ పార్టులో ఆ పాత్ర ముగుస్తుందా ?

Show comments