Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. గణేష్ మండపం పక్కన చికెన్ భోజనాలు ఏర్పాటు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 30 మందిపై కేసు నమోదు చేశారు నందిగామ పోలీసులు.. నిన్న దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్‌లో చికెన్ బిర్యానీతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఆ అన్నదానం కార్యక్రమం పక్కనే గణేష్ మండపం ఉంది.. వైసీపీ నాయకులు అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడం.. గణేష్ మండపం పక్కన చికెన్ భోజనాలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు.. ఇక, నందిగామ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ వన్ శాతకర్ణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మరో 30 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు నందిగామ పోలీసులు..
Read Also: MLC Kavitha Resignation: ఎమ్మెల్సీ పదవికి కల్వకంట్ల కవిత రాజీనామా!
