MLC Election 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నామినేషన్లకు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండటంతో…విశాఖ, కర్నూల్, చిత్తూరు, అనంతపురం , తూర్పు గోదావరి, కడప, శ్రీకాకుళం స్థానిక సంస్థల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ ముఖ్య నేతలతో ర్యాలీలుగా బయల్దేరి వెళ్లి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్‌నాథ్‌లతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. అదే స్థానానికి టిడిపి అభ్యర్థి వేపాడ చీరంజీవి…రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, కొండ్రు మురళితో కలిసి వెళ్లి నామినేషన్ సమర్పించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్సీ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు.
Read Also: CM YS Jagan and New Governor Relationship: కొత్త గవర్నర్‌తో సీఎం జగన్ సంబంధాలు ఎలా ఉంటాయో..?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగమ్మ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వెన్నపూస రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయ విభాగానికి ఎం.రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ స్థానానికి వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థలు వైసిపి అభ్యర్థిగా మేరుగ మురళీధర్ నామినేషన్ వేశారు. అనంతపురంలో పట్టభద్రుల స్థానానికి టీడీపీ అభ్యర్థిగా…బి రాంగోపాల్‌రెడ్డి నామినేషన్ సమర్పించారు. ఈనెల 24 నామినేషన్ల పరిశీలన జరగనుండగా…మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి.