NTV Telugu Site icon

Sharan Navaratri 2022: కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి నదీ విహారానికి బ్రేక్

Teppotsavam

Teppotsavam

దసర శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు దశకు చేరుకున్నాయి.. ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు.. అయితే, కృష్ణానదిలో నిర్వహించే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి ఈ సారి బ్రేక్‌ పడింది.. కానీ, నది ఒడ్డున హంస వాహనాన్ని ఉంచి.. దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు పూజలు నిర్వహించనున్నారు.. దీనికి ప్రధానం కారణంలో కృష్ణా నదిలో వరద ఉధృతే.. ఎందుకంటే… ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తోంది… దీంతో, నదీ విహారం సాధ్యపడదని జల వనరుల శాఖ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది…

Read Also: Chidambaram Nataraja Temple: చిదంబర ఆలయ సంపద వివాదం.. ప్రభుత్వంపై పురోహితులు ఫైర్

కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో.. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం నిర్వహించడం సాధ్యం కాదని వెల్లడించారు కలెక్టర్ ఢిల్లీరావు, ఇరిగేషన్ అధికారి కృష్ణమూర్తి.. కృష్ణానదిలో ప్రవాహం కారణంగా నదీ విహారం చేపట్టలేకపోతున్నామని.. కేవలం దుర్గాఘాట్‌లో హంస వాహనంపై స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మరోవైపు.. ఈ పూజాది కార్యక్రమాలు తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం.. ప్రకాశం బ్యారేజ్, పున్నమిఘాట్, దుర్గాఘాట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. వేలాది మంది భక్తులు తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వస్తారు కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి… జై భవానీ నామస్మరణతో దుర్గమ్మ ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు.. చివరి దశకు చేరినవేళ భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు దుర్గమ్మ… రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది అమ్మారు.. ఇక, మహిషాసుర మర్ధనిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి, సాత్విక భావం ఏర్పడుతుంది అనేది భక్తుల నమ్మకం.. సర్వదోషాలు పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.