Botsa Satyanarayana: మండలి ప్రతిపక్ష నేత, వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.. స్టీల్ ప్లాంట్పై మీ వైఖరేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అంత అసహనం దేనికి అన్నారు. ఇంతకీ, రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా పని చేస్తుందా అనే అనుమానం వస్తుంది.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారు.. ఈ ప్రభుత్వ పాలనలో చట్టానికి గౌరవం లేదు.. వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి రోజంతా తిప్పి కోర్టులో పెట్టారు.. జడ్జి చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Ibomma Ravi: ఐబొమ్మ రవికి 5 రోజుల పోలీస్ కస్టడీ.. ఇక డబిడదిబిడే!
ఇక, సీఐ సతీష్ కుమార్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు అందుకే ఆత్మ హత్య చేసుకున్నాడు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇది ప్రభుత్వ హత్యే అని నేను అంటున్నాను, వచ్చి నన్ను అరెస్టు చెయ్యండి అని సవాల్ విసిరారు. అధికారం ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా.. అన్ని రోజులు ఒకలానే ఉండవు అని చెప్పుకొచ్చారు. మా అభిప్రాయాలని నిర్మోహమాటంగా చెప్తాం, చెప్తూనే ఉంటాం.. ఇక, స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు బాధ్యతగా లేవు.. అంత అసహనం ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసన మండలిలో తీర్మానం చెయ్యమంటే ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు..? అని అడిగారు. మా హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం, మీరెందుకు అలా చెయ్యడం లేదన్నారు.
Read Also: Rajamouli : దేవుడిపై రాజమౌళి కామెంట్స్.. పాత వీడియోలతో పెరిగిన రచ్చ
అయితే, విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి, అందుకే అడుగుతున్నాం, ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అడిగారు. మీరు చేసేది రాజ్యాంగ బద్ధమైన పాలన అనుకుంటున్నారా..?.. తాలిబన్ల పాలన అనుకుంటున్నారా..?.. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బాధేస్తుంది.. తప్పు చేస్తే శిక్షించండి.. అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదు అని ఆయన పేర్కొన్నారు.
