Site icon NTV Telugu

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఎన్జీటీ కీలక తీర్పు

అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ (NGT) తీర్పునిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి నిపుణులతో కమిటీ వేయాలని ప్రతిపాదించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టొద్దని సూచించింది.

Also Read: ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే జగన్‌ నాశనం చేస్తున్నాడు: నిమ్మల రామనాయుడు

ఈ ప్రాజెక్టు నిర్మాణం పై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయాలని, ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని పేర్కొంది. నిబంధలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎన్జీటీ బెంచ్‌ స్పష్టం చేసింది.

Exit mobile version