Site icon NTV Telugu

Flexi war between YCP leaders: అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు.. న్యూ ఇయర్‌ ఫ్లెక్సీ వార్‌..

Flexi War

Flexi War

Flexi war between YCP leaders: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయగిరి, దుత్తలూరు, నందవరం.. తదితర ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఫొటోను కూడా పొందుపర్చి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫ్లె్క్సీలను ఏర్పాటు చేశారు.. అయితే, ఈరోజు వాటిని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు చించి వేశారని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు.. తాము కూడా వైసీపీకి చెందిన వారమేనని.. ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం భావ్యం కాదని మండిపడుతున్నారు.. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే.. తమ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుబ్బారెడ్డి. మొత్తంగా.. 2022 ఏడాదికి గుడ్‌బై చెబుతూ.. 2023 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టాయి.

Read Also: Amit Shah: రానున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అమిత్‌ షా కీలక నిర్ణయం..

Exit mobile version