పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలి పోయిన ఘటన విశాఖలో కలకలం సృష్టించింది.. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.. నవ వధువు సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.. ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పీఎం పాలెం సీఐ రవి కుమార్.. గుర్తు తెలియని విష పదార్థాన్ని సేవించడం వల్ల సృజన మరణించినట్టు చికిత్స చేసిన వైద్యులు తెలిపారని వెల్లడించారు.. అయితే, ఈ విషయంలో ఇరువురి తల్లి తండ్రులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయడం లేదన్నారు..
Read Also: North Korea: ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్
ఇక, సృజనకు నిన్న ఉదయమే కడుపు నొప్పి వచ్చిందని స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లారు.. నెలసరి రుతుక్రమంకి సంబంధించిన సమస్యగా భావించి చికిత్స చేసి పంపారని తెలిపారు సీఐ రవి కుమార్.. అయితే, రాత్రి పెళ్లి పీటలపై కుప్పకూలిపోయింది సృజన.. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె మృతిచెందారు.. అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. సృజన పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి సమాచారం తెలుస్తుందని చెబుతున్నారు సీఐ రవికుమార్. కాగా, బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా, సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే కుప్పకూలింది.. అయితే, కానీ వివాహానికి నెలసరి అడ్డం వస్తుందని సృజనకు వారి తల్లిదండ్రులు ఓ మాత్ర ఇచ్చారని అది వికటించి చనిపోయి ఉంటుందని ఆమె బంధువులు చెబుతున్నారు.. మొత్తంగా పెళ్లిపీఠలపై వధువు కుప్పకూలి మృతిచెందడం సంచలనంగా మారింది.