Site icon NTV Telugu

YCP vs YCP: బెజవాడ మహిళల కొట్లాటలో కొత్త ట్విస్ట్

Ycp Vs Ycp

Ycp Vs Ycp

YCP vs YCP: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ పర్యటన ఉద్రిక్తంగా మారింది. వైసీపీ, టీడీపీ మహిళా కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో హై టెన్షన్‌ నెలకొంది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి దేవినేని అవినాష్.. నిన్న తారకరామ నగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లారు. ఓ మహిళ ఇంటిపై టీడీపీ జెండా కనిపించడంతో.. ఎవరు పెట్టారని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆమె మమ్మల్ని స్థానిక కార్పొరేటర్ మోసం చేశారని.. అందుకే తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకున్నామని బదులిచ్చారు. ఇవాళ కూడా అదే ప్రాంతానికి వెళ్లిన వైసీపీ కార్యకర్తలు.. తమను ప్రశ్నించిన మహిళను నిలదీశారు. దీంతో టీడీపీ- వైసీపీ మహిళ కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది. తెలుగు మహిళలపై వైసీపీ మహిళా కార్యకర్తలు మండిపడ్డారు. గడప గడపకు కార్యక్రమంలో.. ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, గడప గడపకు కార్యక్రమంలో నిలదీసిందన్న కారణంతో.. తమ పార్టీకి చెందిన మహిళను కొట్టారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

Read Also: Off The Record: వైసీపీలోనే ఉంటానంటారు.. వేడి రాజేస్తారు.. ఎమ్మెల్యేపై బంధువు ఒత్తిడి ఉందా?

మరోవైపు ఈ ఎపిసోడ్‌లో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ట్విస్ట్‌ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న వైసిపీ బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులు వైసీపికి చెందినవాళ్లని.. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వైసీపీ నేతలు కార్యకర్తలను కొట్టారని మండిపడ్డారు. సొంత పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తేనే కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయితే, బాధితులంతా వైసీపీకి చెందినవాళ్లే అన్నారు.. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వైసీపీ నేతలు కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు.. చాలా విషయాలు మాట్లాడాలి.. కానీ, సొంత పార్టీ అవడం వల్ల మాట్లాడలేకపోతున్నానన్నారు.. సొంత పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తేనే కొడతారా..? అని నిలదీశారు.. కొట్టినవాళ్లలో ఆ డివిజన్ మహిళల కన్నా వేరే ప్రాంతం వాళ్లు ఉన్నారని.. ప్రశ్నించారు కాబట్టే కొట్టారని.. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ప్రకటించారు.. దీంతో, ఈ వ్యహారం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

Exit mobile version