Site icon NTV Telugu

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై పూర్తయిన కసరత్తు…

ఏపీ కాంగ్రెస్ కు త్వరలో నూతన అధ్యక్షుడు నియామకం జరగనున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు దృష్టి సారించింది ఏఐసిసి. అయితే ఏపీసీసీ అధ్యక్షుడు ఎంపిక పై కసరత్తు పూర్తయింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించారు ఏపీ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాండీ, ఇంచార్జ్ సెక్రటరీలు మయ్యప్పన్, క్రిస్టఫర్ లు. ఏపీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ అనుబంధ సంఘాలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యకులను కలిశారుఏఐసిసి ఇంచార్జ్ లు.

ఇక విజయవాడలో రెండు రోజుల పాటు ఏపి నూతన అధ్యక్షుడి ఎంపిక పై రాష్ట్ర నేతలతో ముఖాముఖి సమావేశాలతో అభిప్రాయ సేకరణ పూర్తి అయింది. జనవరి మొదటి వారంలో ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ ని కలిసి నివేదికను ఇవ్వనున్నారు ఏపీ ఇంచార్జ్ ల బృందం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ను వేగంగా పూర్తి చేయాలని ఏపి ఇంచార్జ్ ఉమన్ చాండీని ఆదేశించింది. ఏఐసిసి అధిష్ఠానం. ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, డా.కేవిపి రామచంద్ర రావు, ప‌ల్లంరాజు తదితరులను సంప్రదించింది ఏఐసిసి అధిష్టానం. అయితే ఈ రేసులో డాక్టర్. చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, హర్ష కుమార్ ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version