NTV Telugu Site icon

AP Liquor Shops: ఏపీలో ప్రారంభమైన కొత్త మద్యం షాపులు..

Ap Liquor

Ap Liquor

AP Liquor Shops: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా సర్కార్ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించింది. కొత్త దుకాణాలకు మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. బ్రాండెడ్ లిక్కర్ ధరల విషయంలోనూ మార్పులు చేసింది. అయితే, క్వార్టర్ మందు కేవలం 99 రూపాయలకే అమ్మకాలు జరిగేలా చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Read Also: Uttarpradesh : ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాము.. దాంతోనే ఆస్పత్రికి వచ్చిన దానికాటుకు గురైన వ్యక్తి

కొత్త షాప్స్ ఓపెన్..
అయితే, గత ప్రభుత్వం ప్రారంభించిన గవర్నమెంట్ మద్యం దుకాణాలను ఎన్టీయే సర్కార్ మూసివేసింది. నూతన మద్యం పాలసీకి అనుగుణంగా కొత్త షాప్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. రెండేళ్ల కాల పరిమితితో ప్రభుత్వం నిర్వహించిన టెండర్లకు అనుగుణం గా నేటి నుంచి కొత్త లిక్కర్ వ్యాపారం స్టార్ట్ అయింది. నేడు కేటాయించిన ప్రాంతాల్లో మద్యం వ్యాపారులు తాత్కాలికంగా తమ షాపులను ప్రారంభించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో తమ షాపులను నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించారు.

Read Also: Mid Night Attack: అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి విధ్వంసం

మద్యం ధరల్లో మార్పులు..
ఇక, ధరల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం తాజాగా స్వల్ప మార్పులు చేసింది. లిక్కర్ అమ్మకాల పైన రెండు శాతం సెస్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డ్రగ్స్ నిరోధానికి ఈ మొత్తాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఏదైనా ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధర 150.50 రూపాయలుగా ఉంటే.. దానికి 160 రూపాయలు వసూలు చేయనుంది. ఈ మేరకు ప్రివిలేజ్ ఫీజును కూడా అదనంగా పెంచేసింది. క్వార్టర్ బాటిల్ ధర 90.50 రూపాయలుగా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర రూ. 100 అవుతుంది.

Read Also: Tirumala Landslides: తిరుమలలో భారీ వర్షాలు.. టీటీడీ అలర్ట్

నాణ్యమైన మద్యం..
అయితే, క్వార్టర్ లిక్కర్ ధర 99 రూపాయలకే విక్రయించాలని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపుల నిర్వహణ పైన స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మద్యం అమ్మకాలు, ధరలు, నాణ్యత విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ రావొద్దని తేల్చి చెప్పింది సర్కార్. ఇక, డిజిటల్ పేమెంట్స్ కు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. కాగా, ఐదేళ్లు తర్వాత తిరిగి అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులోకి రావటంతో మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.