NTV Telugu Site icon

జే‌ఎన్‌టీయూ గెస్ట్ హౌస్ ను శోభనం గదిగా మార్చేసిన కొత్త జంట !

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ వర్శిటీ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాకినాడ జెఎన్టీయూ గెస్ట్‌ హౌజ్‌ లో ఏకంగా శోభనం జరిపించడం కలకలం రేపుతోంది. ఓ గది లో నూతన వధువరులకు శోభనం తంతు నిర్వహించారట. ఈ నెల 18 న యూనివర్శిటీకి చెందిన మహిళ సాధికారిత డైరెక్టర్‌ పేరు మీద 201 నంబర్‌ గల రూమ్‌ బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక అటు సరస్వతి నిలయంగా చెప్పుకునే విద్యాలయంలో ఇలాంటి ఘటనలు జరగడం పై యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం పై వర్శిటీ ఉన్నతా ధికారులు కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం అందుతోంది. ఇక ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కాకినాడ జే‌ఎన్‌టీయూ అతిథి గృహాన్ని శోభనం గదిగా మార్చేసిన కొత్త జంట | NTV